భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (నవంబర్ 27) ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయుడుపేట ఎంపీడీవో కే సురేష్ బాబు అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7వ తేదీన మండలంలోని ప్రతి పాఠశాలలో బడివైపు ఒక అడుగు కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు.విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి చర్చించి విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను నెరవేర్చడం కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మండల విద్యాశాఖాధికారి మునిరత్నం, తాసిల్దార్ ఎం. రాజేంద్ర, సిడిపిఓ ఉమామహేశ్వరి, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply