భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (నవంబర్ 26) తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో సమతా సైనిక్ దళ్ నాయకులు, జై భీమ్ అంకన్న నివాసంలో మంగళవారం కలిసి నవంబరు 26 న 75 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలతో ఆవిష్కరించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగమైన మహా గ్రంధం గురించి హక్కులు గురించి తెలియజేయడం జరిగింది.. ప్రపంచం లో ఏదైనా అత్యున్నత గ్రంథం ఉన్నదా అంటే అది రాజ్యాంగం మాత్రమే అని కొనియాడారు. 2 సంవత్సరాలు 11 నెలలా 18 రోజులు అంబేడ్కర్ ఒక్కరే అవిరళ కృషి చేసి రాజ్యాంగం రాసి భారతీయులు అందరి కోసం హక్కులు సాధించి పెట్టిన ఘనత అంబేడ్కర్ గారికే దక్కిందని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన జై భీమ్ అంకన్న ను విజయవాడ సమతా సైనిక్ దళ్ రాష్ర్ట నాయకులూ పిల్లి సురేంద్ర బాబు (ఎక్స్ ఆర్మీ) సమతా సైనిక్ దళ్ రాష్ర్ట ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర కో కార్యదర్శులు సుధీర్, ఫణీంద్ర కుమార్ జవ్వాజి, స్థానిక సూళ్లూరుపేట దళిత నాయకులతో కలిసి పరామర్శించడం జరిగింది.. వివరాల్లోకి వెళ్తే గాయపడిన అంకన్న సూళ్లూరుపేట మండల విద్యాధికారి ఆఫీస్ నందు రిసోర్స్ టీచర్ గా పనిచేస్తుంటారు..తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మంగలంపాడు దగ్గర ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడడం జరిగింది . సమీప నాయుడుపేటలోని ట్రినిటీ హాస్పిటల్ లో విరిగిన కాలుని సర్జరీ చేయించుకున్నారు. ఈ సంధర్భంగా పరామర్శించిన వారిలో ASS నాయకులు పిట్ల చిన్నా, దళిత యువ నాయకుడు అక్కరపాక కిషోర్ లతో పాటు వి సి కె పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్ మల్చిచెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply