భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 29) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వివరణ పలు రకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మండలంలోని డేవిస్ పేట పంచాయతీ పరిధిలో సాయి కృపా ఐస్ ఫ్యాక్టరీ వున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ కి ప్రభుత్వం నుండి ఏ యే అనుమతులు మంజూరు అయినాయి అని సమాచార హక్కు చట్టం 2005 అర్జీ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు సాయి కృపా ఐస్ ఫ్యాక్టరీ సింగిల్ విండో ద్వారా అనుమతులు పొంది వున్నది. అయితే ఐస్ ఫ్యాక్టరీ కాంపౌండ్ లోనే మరో పరిశ్రమ రొయ్యలను ప్రాసెస్ చేసి, ఎగుమతులు చేస్తూ కోట్లల్లో లాభాలను గడిస్తున్నది. ఆ పరిశ్రమ నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలు నీటి పారుదల కాలువలోకి వచ్చి చేరుతూ కాలుష్యాన్ని పెంచుతున్న విషయం గమనార్హం. ఆ రొయ్యల పరిశ్రమకు పొందిన అనుమతులు ఏవీ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో లేవని పంచాయతీ అధికారులు సమాచార హక్కు చట్టం 2005 అర్జీకి ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఇందుకూరుపేట మండలం ఎం.పి.డి.ఓ. నాగేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధి సదరు విషయంపై వివరణ కోరగా ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాధు ఇస్తే అప్పుడు ఆ రొయ్యల ఫ్యాక్టరీ అనుమతుల గురించి పరిశోధన చేస్తామని వివరణ ఇచ్చారు. ఒక మండలస్థాయి అధికారి ఇచ్చిన సమాధానం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గ్రామ పంచాయితీ పాలకవర్గం, అవినీతి అధికారులతో కుమ్మక్కై కొత్త పరిశ్రమలకు అడ్డగోలుగా అనుమతులను మంజూరు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇందుకూరుపేట మండలం ఎం.పి.డి.ఓ. మాటలు గ్రామ ప్రజలు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే వాస్తవమైతే పంచాయతీలో జరుగుతున్న అవినీతికి, కాలుష్యాన్ని పెంచుతున్న పరిశ్రమలకు అడ్డుకట్ట వేయుటకు, కాలుష్యం బారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడుటకు ఉన్నతధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Leave a Reply