భీమ్ న్యూస్ ప్రతినిధి వజ్రపు కొత్తూరు (నవంబర్ 30) శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండి, గోవిందపురం పంచాయతీ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు పాల్గొని తెలిపారు. లక్షలాది మంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు, చేనేత కార్మికులు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సామాజిక పింఛన్లు ఇస్తున్న ఘనత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్యం, వార్డు మెంబర్ గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply