భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (నవంబర్ 30)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పొలాలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నీట మునిగిపోయాయి. తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామంలో సుమారు 250 ఎకరాలు వరి నాట్లు నీట మునిగాయి కేవలం ఒక గ్రామంలోని ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా వరినాట్లుతో పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు దిగాలుగా ఉన్నారు. కళ్ళముందే పంట పొలాల్లో వారి నాట్లు కొట్టుకుపోవడంతో శనివారం రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply