భీమ్ న్యూస్ ప్రతినిధి కాకినాడ (డిసెంబర్ 02) ఏపీ లో కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు రవాణా అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు మరికొందరు మాఫియాగామారి పోర్టుని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకొని ఈ అక్రమరవాణా కొనసాగిస్తున్నారు.ఇన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యం బహిరంగంగా, అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది అనుకోలేము. కనుక ఈ వ్యవహారంతో ఆయన కూడా సంబంధం ఉందనే భావించాల్సి ఉంటుంది.అయితే ఈ అక్రమ బియ్యం రవాణా వలన ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలకు కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బియ్యం అక్రమ రవాణా గురించి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అర్దమవుతుంది.“పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని ఈవిడగా దోచుకున్నారు. రేషన్ బియ్యం ఉపయోగించని పేద ప్రజలు దానిని వైసీపీ దళారులకు 5-6 రూపాయలకు తిరిగి అమ్మేస్తే, ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి భారీగా డబ్బు సంపాదించారు.
ఈ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లకి కూడా ఇదే చివరి హెచ్చరిక. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాను,” అని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.కొంత మంది పేదలు రేషన్ బియ్యం వినియోగించుకోవడం లేదని ఈ వ్యవహారంతో స్పష్టమైంది కనుక దానిని కూడా ఆలోచిస్తున్నాము. ఏవిదంగా చేస్తే వారికి మేలు కలుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము,” అని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఒక్కో కేజీపై ప్రభుత్వం సుమారు రూ.26కి పైగా చేసి పేదలకు రేషన్ బియ్యం అందిస్తోంది. కానీ అది దుర్వినియోగం అవుతోందని స్పష్టమైంది. కనుక దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై కొత్తగా నిబంధనలు, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే ఈ పధకానికి పరిమితులు విధించే అవకాశం కూడా ఉంది.అంటే వైసీపీ నేతల ఈ రేషన్ బియ్యం అక్రమరవాణా వలన ఇప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్న మాట! పేదలకు సంక్షేమ పధకాలు ఇచ్చి గొప్ప మేలు చేశానని నేటికీ గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆయన కుర్చీలో దిగిపోయిన రాష్ట్రానికి, రాజధానికి, ప్రజలకు చేసిన నష్టం ఇంకా అంతుపట్టడమే లేదు. ఏపీ ప్రజానీకం ఇంకా ఎన్ని అక్రమాలు, అవినీతి భాగోతాలు చూడాలో మరి అంటున్నారు.
Leave a Reply