భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 02) ఏ సమస్యలు వున్నా మండల కేంద్రంలోని అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుని సమస్య పరిష్కారం కోసం ఎదురు చూడటం తప్ప ప్రశ్నించలేని నిస్సయ స్థితిలో వుండేవారే దివ్యాంగులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి మండల కేంద్రమైన కొత్తూరు గ్రామంలో వున్న మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి తన సమస్య వున్నవించుకోవడానికి ఓ దివ్యాంగుడు వచ్చాడు. తహశీల్దార్ కార్యాలయం ఒకటవ అంతస్తులో వున్న కారణంగా తాను మెట్లు ఎక్కి పైకి వెళ్ళలేని పరిస్థితిలో వెనుదిరిగి వెళ్ళిపోక తప్పలేదు. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన గురించి మీడియా ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల నాయకులు మండల తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ కి తెలుపగా జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కి మండల అధికారులు తప్పని సరిగా హాజరుకావాలి., ఈ మండలంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ తహశీల్దార్ కార్యాలయంలోనే వుంది అందుకే అధికారులందరూ ఇక్కడే వున్నారు అని తెలిపారు.
రేపు మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండలంలోని జగదేవిపేట పంచాయతీ కమ్యూనిటీ హాలులో స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులు కొంతమంది ట్రై సైకిల్స్ అందుకోబోతున్నారు. కానీ మండల తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ మాత్రం దివ్యాంగుల గురించి అసలు పట్టీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన చెందారు. మానవత్వం మూర్తీభవించిన ఎం.ఎల్.ఏ. ప్రశాంతిరెడ్డి ఇందుకూరుపేట మండలంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమం దివ్యాంగులకు, వృద్ధులకు అందుబాటులో జరిగే విధంగా చూడాలని మీడియా ముఖంగా కోరారు.
Leave a Reply