భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (డిసెంబర్ 01) ఏపీలోని తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం నుండి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం తుఫాన్ ఎఫెక్ట్ మరింత పెరగడంతో ఎక్కడ చూసినా, జలకళ సంతరించుకుంది. ప్రధానంగా కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో సైతం ఎడతెరిపి లేకుండా ఆదివారం వర్ష ప్రభావం కనిపించింది. దీనితో తిరుమల మాడవీధుల్లో నీటి ప్రవాహం ఏరులా ప్రవహించింది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా రెండవ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడడంతో, సమాచారం అందుకున్న టీటీడీ వెంటనే జేసీబీలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంది. టీటీడీ సకాలంలో స్పందించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం ధాటికి తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటివనరులు కాగా, శనివారం నుండి కురుస్తున్న వర్షం ధాటికి వీటిలో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకుంది. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు నీటితో నిండిన జలాశయాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అలాగే తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అధిక వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోనే 5 అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు గుర్తించగా, వాటిలో అన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాకు చెందినవి కావడం విశేషం. కేఎం అగ్రహారంలో 187 మి.మీ, కేకేఆర్కే పురం 162 మి.మీ, రాచపాలెం 152 మి.మీ, మన్నార్ పొలూరు 149 మి.మీ, భీములవారిపాలెం 137 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మొత్తం మీద ఫెంగల్ తుఫాను ప్రభావం తిరుపతి జిల్లాపై అధికంగా ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావాన్ని సమీక్షిస్తోంది. తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లో పూర్తిస్థాయి వర్షపాతం నమోదయింది, గూడూరు, వెంకటగిరి, చిల్లకూరు కోట, వాకాడు, చిట్టమూరు, తడ, నాయుడుపేట, దొరవారి సత్రం, సూళ్లూరుపేట ఓజిలి, పెళ్లకూరు, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, వరదయ్యపాలెం, ఏర్పేడు, పిచ్చాటూరు, నాగలాపురం, వడమాలపేట, పుత్తూరు తదితర మండలాల్లో భారీగా వర్షపాతం నమోదయింది. వాగులు, వంకలు పొర్లి పారుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులకు తగిన విధంగా సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.
Leave a Reply