భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 03) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామం కమ్యూనిటీ హాలులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షుడు కూకటి వెంకటేశ్వర్లురెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల పించన్ 3 వేల నుండి 6 వేలకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, సీ.ఎం. కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీ.పీ.ఆర్. ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చానని, కోవూరు నియోజకవర్గంలో ప్రజలు అత్యంత ఆదరణ పొందిన నేతగా ప్రజా సేవలోనే కొనసాగుతానని తెలియజేశారు. అనంతరం వీ.పీ.ఆర్. ఫౌండేషన్ అందించిన బ్యాటరీ ట్రై సైకిళ్ళును దివ్యాంగులకు పంపిణీ చేశారు. పలు సమస్యలపై బాధితుల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల తహశీల్దార్ కృష్ణ ప్రసాద్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావెళ్ళ వీరేంద్ర నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి తో పాటుగా వివిధ గ్రామాల ఎన్డిఏ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply