భీమ్ న్యూస్ ప్రతినిధి కోవూరు (డిసెంబర్ 03) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని 107 మంది నడవలేని దివ్యాంగులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణి చేశారు. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాలో నిర్వహించిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అన్నారు. తాను రాజకీయాలలో రాక ముందు నుంచే విద్యా, వైద్యం, వికాసం మరియు ఆధ్యాత్మిక రంగాలలో వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాసేవ చేయడం కోసమే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తానూ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రై సైకిళ్ళు కావాలని కోరారు. వారి అభ్యర్ధన మేరకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆగస్టు 15 న 40 మందికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేశామని గుర్తు చేశారు.
ట్రై సైకిళ్ళు కావాలని పలు విజ్ఞప్తులు రావడంతో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓ సర్వే నిర్వహిస్తే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 26 మంది, కోవూరులో 17 మంది, ఇందుకూరుపేటలో 32 మంది, విడవలూరులో 27 మంది, కొడవలూరులో 07 మంది నడవలేక అవస్థలు పడుతున్న 107 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. వారందరికీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందివ్వడం చాలా ఆనందంగా వుందన్నారు. దివ్యాంగుల పెన్షన్ 3 వేల నుంచి 6 వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు ఎం.పి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి టిడిపి అధ్యక్షులు ఎం.వి. శేషయ్య, అడపాల అనీష్ రెడ్డి, కోవూరు టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, టిడిపి రాష్ట కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, కొడవలూరు టిడిపి అధ్యక్షులు అమరేంద్ర రెడ్డి, ఇందుకూరుపేట మండలం టిడిపి అధ్యక్షులు రావెళ్ళ వీరేంద్ర నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, ముంగమూరు శ్రీహరి రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎన్డిఏ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply