భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (డిసెంబర్ 03) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో మంగళవారం కొత్తగుంట నుండి మల్లాం వైపుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు తాగేడు గ్రామం వద్ద కాజువే రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతికి ప్రమాదవశాత్తు గల్లంతైన నేపథ్యంలో నాయుడుపేట పట్టణానికి చెందిన అన్నమేడు చంద్రారెడ్డి సోదరుడు మధురెడ్డి, షారుక్ అనే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో గల్లంతయ్యారు. దీనితో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. కాగా మధురెడ్డి తోపాటు ద్విచక్ర వాహనంపై ఉన్న షారుక్ సైతం వరద నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరదలో కొట్టుకు పోయినఇద్దరు యువకుల ఆచూకీ కోసం సంఘటనా స్థలంలో ఎదురుచూస్తూ వారి కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నారు.
ఒకరి మృతదేహం లభ్యం :
చిట్టమూరు మండల కేంద్రం దగ్గరగా మంగళవారం రోజు ఉదయం గల్లంతైన ఇద్దరు యువకుల్లో మధురెడ్డి అనే వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో యువకుని కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Leave a Reply