భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (డిసెంబర్ 03) ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా మంగళవారం పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామంలో భవిత దివ్యాంగుల కేంద్రం నందు వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం దొరస్వామి, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం, సుబ్రహ్మణ్యం ఇరువురు మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారిని చులకనగా చూడవద్దని కోరారు. వారు దేశానికి ఎంతో ఆదర్శమైన పనులను సాధించి చరిత్రలో స్ఫూర్తిగా నిలిచారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి సహచరులు వారిని చులకనగా చూడకుండా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని తపన ఉండాలన్నారు. అంగ వైకల్యం గా ఉంటూ ఎన్నో చారిత్నాత్మక విషయాలు సాధించిన ఘనత వారిదనిఅన్నారు. కలెక్టర్లుగా, సంగీత బాణిలో, రచన రంగంలో, గాయనీ గాయకులుగా దేశ చరిత్రచాటిన మహోన్నతులు వీరిలో ఉన్నారనేది మరిచిపోకూడదని తెలిపారు. అనంతరం భవిత స్కూల్ సెంటర్ టీచర్స్ మాట్లాడుతూ ప్రతిరోజు పిల్లలను పాఠశాలకు క్రమం తప్పకుండా పంపాలని వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ, స్విచ్ థెరఫీ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్, హోం బెస్ట్ అలవెన్స్, గర్ల్స్ స్టైఫండ్స్, మొదలైన రకాల అలవెన్స్ లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో భవిత ఉపాధ్యాయులు వనిత, వైష్ణవి, ఆలూరు సుబ్బరామయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a Reply