భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, విజయవాడ (డిసెంబర్ 04)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భూమి కంపించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ములుగులో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్ర మేడారంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేటతో సహా పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో జనాలు భయంతో వణికిపోయి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి మూడు సెకన్ల పాటు కంపించింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, హయత్నగర్లో పాటు పలు ప్రాంతాలో భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ప్రజలు తెలిపారు. భూమి కంపించడంతో అపార్ట్మెంట్ల నుంచి జనంబయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7.27 గంటలకు వచ్చిన భూకంపం.. ములుగు జిల్లాలోని.. ఐలాపూర్లో అడవిలో.. అంటే.. మేడారంకి దగ్గర్లోనే భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా ఉంది.ఇది భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే.. భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే.. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల.. భూమి ఉపరితలంపైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలను మాత్రమే అనుభూతి చెందారు.
ఎందుకు వచ్చింది ? ..
భూకంపం ఒక చోట వచ్చిందంటే.. దానికి చాలా కారణాలు :
1.ఈ భూకంపం రావడానికి ముందు.. బలమైన సంకేతం ఒకటి ఇచ్చింది. ఆ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు నాగారం దగ్గర.. భారీ టోర్నడో (Tornado) వచ్చి, దాదాపు 50వేల చెట్లు నేలకొరిగాయి. అక్కడే ఈ టోర్నడో ఎందుకు వచ్చిందంటే.. ఆ ప్రాంతంలో.. వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయి.
2. ములుగు ప్రాంతంలో.. సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ, అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. ఈ గనుల తవ్వకాలు.. రెండు రాష్ట్రాల్లోమూ జరుగుతున్నాయి. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి.
3. ములుగు మాత్రమే కాకుండా.. తెలంగాణ అంతటా.. భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో.. భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో.. భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అని అంటున్నారు.
4. గోదావరి జలాలు ఉన్న అన్నిచోట్లా భూకంప ప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకూ ఈ ప్రకంపనలు వచ్చాయి. తద్వారా.. గోదావరి జలాల వల్ల.. భూమిలో గట్టిదనం తగ్గిపోయి.. మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ లో అలర్ట్:
ఇప్పటివరకూ హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు. కానీ.. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. అంటే.. హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. కాస్మొపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో 40 నుంచి 50 అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారు. భూకంపాలు వస్తే, ఆ భవనాలు నిలబడగలవా అన్నది తేలాలి. అందువల్ల భూకంపాల్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
ప్రమాదమే మరి :
ఇకపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. భూకంపాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జియోగ్రాఫికల్గా భూమి ఎలా ఉంది అనేది పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. 40 కిలోమీటర్ల లోతు నుంచి కూడా ప్రకంపనలు పై దాకా వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. శాస్త్రవేత్తలతో చర్చించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని అంటున్నారు మరి..!
Leave a Reply