భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (డిసెంబర్ 04)
(నిండు వర్షంలోయాలకారి కండ్రిక గ్రామం పాఠశాలలో)
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చింతపూడి గ్రామపంచాయతీ యాలకండ్రిగ, లక్ష్మీ నాయుడు కండ్రిగ, పుల్లూరు పంచాయతీ పసుపు కండ్రిగ గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు, కూర్చునేందుకుకూడా సరైన భవనం లేక గత పది సంవత్సరాల కాలం నుంచి ఎండ , గాలి,వాన, చలి, తుఫాను తదితర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, నిండు తుఫానులో ,నిండు వర్షంలో తడుస్తూ నిలిచి నిలబడక ,కూర్చొని కూర్చొనక ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా మాగ్రామాల్లోని విద్యార్థులకు మరింత శ్రద్ధగా పాఠాలు నేర్పేందుకు, విద్యార్థులు నేర్చుకునేందుకు ముఖ్యంగా భవన వసతి కూడా లేదని అంటున్నారు తల్లిదండ్రులు. నేటి కాలంలో కంప్యూటర్లతో నడుస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ధీనావస్థలో కొనసాగుతున్నాయని, కూలిపోయే ( డెమోలిషన్) కండిషన్లో పాఠశాల భవనాలు ఉండడం, ఇదే దుస్థితిలో పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన జరగాల్సిరావడం దురదృష్టకరమని, ప్రభుత్వము వినకపాయే, గ్రామస్తులు చక్కదిద్ధకపాయే..! అన్న రీతిలో పాఠశాలభవనాలు, పాఠశాల ప్రాంగణాలు తీర్చిదిద్దబడి ఉన్నాయని తెలిపారు. చలి అయిన, ఎండైనా వానైనా, తుఫాన్ అయిన, భారీ వర్షాలైనా, పాఠశాలల్లో విద్యార్థులు ఏదో ఒక మూలన కూర్చుని చదువు నేర్చుకోవాల్సిందే మరి. మా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎవరు ముందుకు రారా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు టీచర్లనే ప్రాధేయ పడుతున్నారు.
(లక్ష్మీ నాయుడు కండ్రికలో తీవ్రమైన చలిగాలిలో )
తమ పిల్లలను స్కూల్లో జాగ్రత్తగా చూసుకోండని పైన చూస్తే పటారం లోన చూస్తే లోటారం అనే రీతిలో మా పాఠశాలలు నడవడం అనేది జరుగుతోందని విద్యార్థులు ,తల్లిదండ్రులు, గ్రామస్తులు అంటున్నారు. లోపల కూర్చుంటే పెచ్చులూడి నెత్తిన పడడం, బయట కూర్చుంటే వానలో తడవడం, పాఠశాలల్లో పైకప్పులు ఊడిపోవడం జరుగుతుంటే మా గ్రామాల్లో పాఠశాలలకు వేరొక భవనాన్ని కేటాయించాల్సిందిగా, లేదా ప్రభుత్వం కొత్తభవనాలను నిర్మించాల్సిందిగా గతం లో ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీలు పెట్టినప్పటికీ పట్టించుకున్న పాపానపోలేదని మరి మాపిల్లల సంగతేమిటిఅని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఐదు మందైనా, పది మందైనా ఉన్నప్పుడు ప్రభుత్వం పాఠశాలకు కొత్త భవనాల ఏర్పాటు జరగడంలేదని తల్లిదండ్రులు వాపోయారు. అంతేకాకుండా కనీసం అంగన్వాడి పాఠశాల భవనాలు కూడా మాగ్రామాల్లో లేవని, ఒకవేళ ఉండి ఉంటే ఆ భవనంలోనైనా మా పిల్లలను కూర్చోబెట్టి చదువులు నేర్పించేందుకు ఉపాధ్యాయులకు సహకరిస్తామని తల్లిదండ్రులు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకోకపోగా, విద్యార్థులకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అప్పుడు ప్రభుత్వ అధికారులు స్పందిస్తారని అన్నారు. ఇకనైనా నేటి ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, నాయకులు స్పందించి మా గ్రామాల పాఠశాలలకు నూతన భవనాలు మంజూరు చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా ముఖంగా కోరుతున్నారు.
Leave a Reply