భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 06) ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తమ నిర్ణయాల్లో పేరెంట్స్ ను భాగస్వాములను చేస్తోంది. ప్రభుత్వ ఆలోచనలను పేరెంట్స్ తో పంచుకుంటూ వారి సూచనలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న మెగా పేరెంట్ – టీచర్ సమావేశానికి నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 45,094 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ – టీచర్ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం ఏయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు బాపట్లలో డిప్యూటీ సీఎం పవన్ కడపలో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో పేరెంట్స్ ను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో ప్రారంభించనున్నారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా అన్ని విభాగాల్లోనూ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు – విద్యా ప్రమా ణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి నిర్వహించే ఈ సమావేశం కోసం పేరెంట్స్ కు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశం ద్వారా ఇక నుంచి వారి భాగస్వామ్యం తోనే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేయనున్నారు.
Leave a Reply