భీమ్ న్యూస్ ప్రతినిధి రావులపాలెం (డిసెంబర్ 06) తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని బెతెస్థా ప్రార్థనా మందిరంలో జరిగిన ప్రి – క్రిస్మస్ వేడుకలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ క్రీస్తు జీవితం శాంతికి,సమాధానానికి ప్రతీకగా నిలిచిందని చెప్పి క్రిస్మన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులంతా గొప్ప వేడుకగా జరుపుకునే క్రిస్మస్ పండగ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సత్యానందరావు అన్నారు. అనంతరం క్రిస్మన్ కేకును సత్యానందరావు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభి రామయ్య, కాస సాగర్,జక్కంపూడి వెంకటస్వామి, సాధనల శ్రీనివాస్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply