భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 06) భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భీం భారత్ సైనిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోలవరపు కార్తికేయ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీ పాగావారిపాలెం గ్రామం వద్ద నున్న డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీలు చదివిన వ్యక్తి, ప్రపంచ మేధావిగా పేరు గాంచిన బాబాసాహెబ్ 68వ వర్ధంతి నివాళులు అర్పించడం తమ అదృష్టమని తెలిపారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వారందరికీ తోడ్పాటుగా భీం భారత్ సైనిక్స్ పని చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.బి.ఎస్. సైనికులు కందల దేవకుమార్, మనుబోలు జనార్ధనరావు, పోలవరపు వినోద్ కుమార్, పోలవరపు నిఖిల్, నెల్లూరు వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply