భీమ్ న్యూస్ ప్రతినిధి నిజామాబాద్ – తెలంగాణ (డిసెంబర్ 06) మనిషి బుర్రలోకి వచ్చే ఆలోచనతో తాను ఏదైనా చేయగలనని నా కోణంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు కొంతమంది. ఇది కూడా ఆకావులకే వస్తుంది. కుటుంబ కలహాల కారణంగా రైలును ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తి. రైలు పట్టాల మధ్యలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గేట్ మ్యాన్ గమనించి పైలెట్‌ను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు పట్టాల మధ్యలో నుంచి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని రైల్వే గేటు దాటేందుకు వేచి ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని రైలు పట్టాలపై ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై దూసుకువచ్చాడు. దీంతో షిరిడీ నుండి తిరుపతి వెళుతున్న 17418 వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ అరగంట పాటు నిలిచిపోయింది. 17418 తిరుపతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వస్తున్న సమయంలో నవీపేట నుండి పట్టాల మధ్యలో జగదీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆ రైలుకి ఎదురు దూసుకువచ్చాడు. అది గమనించిన దర్యాపూర్ గేట్మెన్, రైలు పైలెట్లకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్ పోచమ్మకట్ట సమీపంలో నిలిపివేశారు.
రైలు ఆగడం గమనించిన కొందరు స్థానికులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టాలపై నుండి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తన భార్యతో గొడవ వల్లనే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు పట్టాల మధ్య నుంచి రైలుకు ఎదురుగా వెళ్లానని ఒప్పుకున్నాడని పోలీసులు సమాచారం ఇచ్చారు. జగదీష్ స్వస్థలం బీంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. అయితే గత కొంత కాలంగా నవీపేట మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. జగదీష్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Leave a Reply