భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (డిసెంబర్ 06) తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలో పాఠశాలల అభివృద్ధి కొరకు, విద్యార్థుల తల్లిదండ్రులను, ప్రజలను భాగస్వామ్యాన్ని చేసే ఒక నూతన బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యక్రమాన్ని చేపట్టింది. “బడివైపు ఒక అడుగు — కావాలి ముందడుగు” అనే నినాదంతో రేపు శనివారం, 7-12-2024 తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ”మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలను” ఏర్పాటు చేయనున్నారని ఈ సందర్భంగా
మన పెళ్ళకూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగడానికి కావలసిన ముందస్తు జాగ్రత్తలను, సూచనలను ప్రధానోపాధ్యాయులకు, ఫిజికల్ మీటింగ్, మరియు ఆన్లైన్ మీటింగ్ ద్వారా, అదేవిధంగా చరవాణిల ద్వారా పలుమార్లు అందివ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి ఎం శంకరయ్య తెలిపారు. రేపు ఉదయం 9 గం. నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి మించల శంకరయ్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను సాదరంగా స్వాగతం పలకాలని, సమావేశంలో ప్రారంభమైన అనంతరం, విద్యార్థులకు హోలిస్టిక్ కార్డ్స్ పంపిణీ, తల్లులకు తండ్రులకు, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్స్, సైబర్ అవేర్నెస్, ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు మరియు శుభదిన్ భోజనంతో తదితర అంశాలతో కార్యక్రమం ముగిస్తుందని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లు ప్రధానోపాధ్యాయులు, సీఎంఆర్టీలు, ఎంఆర్సి సిబ్బంది అందరూ కలిసికట్టుగా కృషిచేసి విజయవంతం చేయాలని ఎంఈఓ లు ఎం. శాంతి, ఎం. శంకరయ్య పిలుపునిచ్చారు.
Leave a Reply