భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (డిసెంబర్ 08) తిరుపతి జిల్లా నాయుడుపేటలో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల విశేషాలతో తెచ్చిన సావనీర్ పుస్తకాన్ని ఆదివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవన్ లో ఆవిష్కరించారు. సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సునీత మాట్లాడుతూ వ్యవసాయాన్ని గిట్టుబాటు కానివ్వకుండా చేసిన పాలకుల విధానాలే వ్యవసాయ రంగం సంక్షోభానికి కారణమన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల తయారీని విదేశీ, బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం వల్లనే పెట్టుబడులు పెరిగి రైతాంగానికి గిట్టుబాటు కాకుండా పోయిందన్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని గత మూడేళ్లుగా రైతాంగం ఆందోళన చేస్తున్నా మోడీ మొండి వైఖరితో వ్యవహారిస్తున్నాడని విమర్శించారు.ఢిల్లీలో రైతులపై జరిగిన లాఠీచార్జిని ఆమె ఖండించారు. రైతాంగం సంఘటిత ఉద్యమాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని పిలుపునిచ్చారు.
ఏఐఎఫ్ టియు న్యూ రాష్ట్ర నాయకులు ఎల్ లక్మీ రెడ్డి మాట్లాడుతూ కారుచౌకగా కూలీలను అందించేందుకే రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజి సెజ్ ల పేరుతో కంపెనీలకు కట్టబెట్టారని అన్నారు.పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కంపెనీ యాజమాన్యాలు వెట్టి చేయిస్తున్నారని అన్నారు. రోజుకి 14గంటల పని దినాన్ని అమలు చేసేందుకు మోడీ పూనుకోవడం వెనక కార్పొరేట్ శక్తులు మన శ్రమ శక్తిని దోచుకునేందుకు అవకాశంకల్పించడమేనన్నారు. ఈ సభలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య, ఆర్ సుబ్బరాయుడు జిల్లా నాయకులు జి.కృష్ణారెడ్డి, వి.రవీంద్ర, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు సిహెచ్ చిన ఓబయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు.
Leave a Reply