భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ – జాతీయం (డిసెంబర్ 09) ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశంలో కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లపై స్పందించింది.రిజర్వేషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర కామెంట్స్ చేసింది. రిజర్వేషన్లు మతాలపరంగా ఇవ్వలేదని రాజ్యాంగబద్ధంగా, వెనుకబాటుతనం కోసం ఇచ్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం రోజున విచారణ జరిగింది. ఈ సందర్భంగానే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కామెంట్స్ చేసింది.
ఓబీసీ వర్గీకరణలను కోలకత్తా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ..77 కమ్యూనిటీల వర్గీకరణ, ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవి. ఇవన్నీ వర్గాల వెనుకబాటు ప్రాతిపదికన మంజూరు చేయబడిందని సమర్పించారు. పశ్చిమ బెంగాల్ లో 27-28% మైనారిటీ జనాభా ఉందని ఆయన స్పష్టం చేశారు. రంగనాథ్ కమిషన్ ముస్లింలకు 10% రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. అలాగే హిందువులలో 66 సంఘాలను వెనుకబడిన వర్గాలుగా వర్గీకరించారు. అప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ల కోసం ఏం చేయాలనే ప్రశ్న తలెత్తింది. అందువల్ల రంగనాథ్ కమిషన్.. ముస్లింలలోని 76 కమ్యూనిటీలను వెనుకబడిన తరగతులుగా వర్గీకరించి, రిజర్వేషన్ లిస్ట్‌లో చేర్చిందని చెప్పారు. కానీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఆధారపడి కోలకత్తా హైకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసిందని సిబల్ తెలిపారు. దీనికే జస్టస్ గవాయి…రిజర్వేషన్లు మతాల ఆధారంగా కాదు అంటూ వ్యాఖ్యానించారు. యితే కపిల్ సిబాల్ కూడా మతం ఆధారంగా చేయాలని తామూ కోరడం లేదని…వెనుకబాటుతనం ఆధారంగానే అన్ని వర్గాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
Leave a Reply