భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 10) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, డేవిస్ పేట గ్రామాల్లో మండల వ్యవసాయశాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మ పి.డి. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శివ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఆత్మ పి.డి. శివ నారాయణ మాట్లాడుతూ, జగదేవిపేట గ్రామ రైతుల పొలాలలో భాస్వరం శాతం ఎక్కువగా ఉంది. ఒక ఎకరా పొలానికి 10 నుంచి 24 కిలోల మధ్య భాస్వరం ఉంటే, అది మధ్యస్థస్థాయి, ఇంతకంటే ఎక్కువగా ఉంటే అది మిగతా పోషకాల లభ్యతను తగ్గిస్తుంది. భాస్వరం పొలానికి పైపాటుగా కాకుండా, చివరి దుక్కిలో తగిన మోతాదులో వేసుకుంటే మొక్కల వేరు వ్యవస్థకు పూర్తిగా అందుతుంది. అధిక ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి 90 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేప పిండి, రెండు కిలోల సూడో మోనాస్ ఫోర్ సెన్స్ కలుపుకుని, చెట్టు నీడ కింద, బాగా పదును ఉంచుకొని, బాగా మాగ పెట్టుకోవాలి. 15 రోజుల తర్వాత రైతులు దీని చివరి దుక్కిలో వేసుకుంటే, నేల నుంచి వచ్చే వ్యాధులు తక్కువగా వస్తాయని తెలియజేశారు.
ఏ.డి.ఏ. రాజ్ కుమార్ మాట్లాడుతూ, వరి నాట్లు నాటే ముందుగా 10 చదరపు మీటరు గుంటలో, ఒక కిలో సూడో మోనాస్ ఫోరసెన్స ను కలిపి, నారుని 30-40 నిమిషాలు ముంచి నాట్లు నాటుకోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా వ్యాధులైనటువంటి అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అనంతరం మండల వ్యవసాయాధికారి డి. రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క ఎకర కు 2.5 నుంచి 5 కిలోల సుడో మోనోస్ ఫోర్ సెన్స్ ను 50 నుంచి 100 కిలోల పశువులు ఎరువుకి కలుపుకొని, సాల్ల మధ్యలో వేసుకోవాలి. నారు పెరికే దానికి 5 నుంచి 7 రోజులు ముందు, ప్రతి 5 సెంట్లలకు కార్బో ఫిరాన్ 3జీ గుళికలు 800 గ్రాములు వేసుకుంటే, ప్రధాన పొలంలో ఉల్లి కోడు, కాండం కుళ్ళు తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కో – ఆర్డినేటర్ శివ జ్యోతి, వి.ఏ.ఏ. పెంచలయ్య, వి.హెచ్.ఎ. మాధవయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Leave a Reply