భీమ్ న్యూస్ ఒంటిమిట్ట ప్రతినిధి దాసరి శేఖర్ (డిసెంబర్ 11) కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈరోజు రైతు సాధికారత సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భాగస్వామ్య పకృతి వ్యవసాయంలో ఎరువులు కషాయాలతో పండించిన కూరగాయలు ఈ రోజు స్టాల్ రూపంలో రైతులకు ప్రజలకు మార్కెటింగ్ మరియు అవగాహన కలిగిస్తూ డాక్టర్ శ్వేత చేతుల మీదుగా ఈ స్టాల్ ప్రారంభించడం జరిగింది. మండలంలో పనిచేసే పకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రారంభించడం జరిగింది. పకృతి వ్యవసాయంలో పండించిన పంటలను కూరగాయలను ఉపయోగించడం వల్ల వచ్చే లాభాలను కెమికల్స్ వల్ల వచ్చే రోగాలను వివరంగా డాక్టర్ శ్వేత వివరించడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు కూరగాయలు తీసుకెళ్లడం జరిగింది.
అలాగే మార్కెట్ టీం మాస్టర్ దేవరాజులు మాట్లాడుతూ ఈ పకృతి వ్యవసాయంలో పండించే పంటలు కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యము రోగాల నుంచి చాలావరకు తగ్గించవచ్చచు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు పండుతున్న కూరగాయలు పంటలన్నీ కలుషితమై ఎక్కువగా రోగాలు వస్తున్నాయని నాచురల్ ఫామ్ ముఖ్య ఉద్దేశం కెమికల్స్ లేకుండా పూర్వము ఎరువులు కషాయాలు న్యాచురల్ పద్ధతిలో పండించుకుంటున్నాము. అదేవిధంగా పంటలు పండించుకోవాలని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కలిగిస్తున్నాము. గవర్నమెంట్ వారు ప్రతి ఆఫీసులో స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది . సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేస్తున్నాము. రైతు బజార్ లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. మా సిబ్బంది పండించిన పకృతి వ్యవసాయ కూరగాయలు పంటలు ప్రజలకు అవగాహన కలిగిస్తూ మార్కెట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పకృతి వ్యవసాయంలో పండించిన పంటలు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. పకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Leave a Reply