భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (డిసెంబర్ 11) తిరుపతి జిల్లాలోని పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి ఎన్ హెచ్ – 71 లో నిర్వాసితులైన చాలామందికి పూర్తి పరిహారం అందించకుండా ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు తెలిపారు. సంబంధిత అధికారులను అడిగితే ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని గత రెండు సంవత్సరాలు కాలంగా తిప్పుతున్నారని వాపోయారు. తక్షణం మాకు పరిహారాన్ని అందించవలసిందిగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఎగువ చావాలి గ్రామం వాస్తవ్యులు గోళ్ళ పాపయ్య ఈ సందర్భంగా తెలిపారు. మాకు ఉన్న స్థలాలను, ఇల్లు, పశువుల కొట్టాం తదితర సంబంధించి పరిహారాన్ని అందించి మాకు న్యాయం చేయవలసిందిగా, మండల, డివిజన్, జిల్లా రెవిన్యూధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని కోరారు. అంతేకాకుండా విద్యుత్తు లైన్ లను మా అనుమతి లేకుండానే మా నివాస గృహాల పైన కరెంటు సప్లై జరిగే విధంగా చేయడం వల్ల ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని తెలిపారు. ఎన్హెచ్ – 71 సంబంధించి మండల ప్రాంతం ప్రారంభం నెలుబల్లి మొదలుకొని నాయుడుపేట వరకు చాలామందికి పరిహారం అందక లబోదిబోమంటున్నారు. కొన్ని గ్రామాలలో ఇల్లు, పొలాలు, అంగళ్లు, దేవాలయాలు కు సంబంధించి పూర్తి పరిహారం అందించనేలేదు. కేవలం పరిహారంలో 20 శాతం కొంతమందికి అందితే మరి కొంతమందికి పూర్తిగా అందలేదు. పరిహారం అందని కొంతమంది కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నా కూడా పరిహారం అందించకుండా నిర్వాసితులకు మొండి చెయ్యి చూపించడం ఎంతవరకు సమంజసం అని నిర్వాసితులు వాపోతున్నారు. తక్షణం రెవెన్యూ అధికారులు, రోడ్డు నిర్వాహకులు స్పందించి బాధితులందరికీ పరిహారాలు అందించవలసిందిగా మీడియా ముఖంగా కోరుతున్నామని తెలిపారు.
Leave a Reply