భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (డిసెంబర్ 12) ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది.పెంగన్ తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే జిల్లాలో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. అన్ని మండలాల్లో గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి.ఇప్పటికే నాటిన వరి నారు ముళ్ళు పలు ప్రాంతాల్లో దెబ్బతినడం తోపాటు తెగుళ్ల బారిన పడ్డాయి .ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
సూళ్లూరుపేటలో ఎంపీడీవో పరిశీలన
చెరువులకు గండ్లు పడితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పలు మండలాల్లోని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . వివిధ పట్టణాలలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా నీటమునగాయి.అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లాలోని తహసిల్దార్లకు , సిబ్బందికి ముందస్తు చర్యల తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు . పాఠశాలలో కూడా సెలవు ప్రకటించారు. నదులు పరివాహక ప్రాంతాలు , వాగులు, వంకలు కాజ్ వే లు ఉదృతంగా ప్రవహిస్తున్న వేళ వాటివద్ద రెవెన్యూ ,పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంచి, సిబ్బందిని కాపలాగా ఉంచాలని తెలిపారు.
(శ్రీకాళహస్తి – పిచ్చటూరు మధ్య రాకపోకల బంద్)
మండలాల్లో అధికారులు ప్రమతంగా ఉండి అవసరమైనప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో రెవెన్యూ సిబ్బంది పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
తుఫాను సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్డు పై పడిన బండరాళ్లు.
Leave a Reply