భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (డిసెంబర్ 14) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో శనివారం సాగనీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నికలు మండల విద్యాశాఖ ఏర్పాట్లతో విజయవంతంగా ముగిసాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎం శంకరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లతో సాగునీటి సంఘాలు ఎన్నికలు మండలంలో శనివారం విజయవంతంగా ముగిశాయని తెలిపారు. అనంతరం మండలంలో జరిగిన మొత్తం19 సాగు నీటి సంఘాల అధ్యక్షులకు, 17 మంది చైర్మన్ పదవులు ఎన్నికయ్యారని మండల మైనర్ ఇరిగేషన్ ఏఈ సుబ్బారావు తెలిపారు. ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు , ఉపాధ్యక్షులు కు ఎన్నికల పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ, వాటర్ డిపార్ట్మెంట్, పోలీస్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply