భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 16) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలోని డాక్యుమెంట్ రైటర్ లు పాత డాక్యుమెంట్స్ అమ్ముతున్నారనే సమాచారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇందుకూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుసంధానంగా పని చేస్తున్న లైసెన్స్ స్టాంప్స్ వెండర్ గుండుబోయిన మమత స్వగ్రామం కలువాయి. ఆమె ప్రస్తుత నివాసం నెల్లూరు రూరల్ మండలం కోడూరు పాడు గ్రామం. మమత భర్త చిన్న వెంగయ్య కూడా డాక్యుమెంట్ రైటర్ గా ఇందుకూరుపేటలోనే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ వెంగయ్య వద్దకు వచ్చిన వ్యక్తులకు వెండర్ మమత గత సంవత్సరం స్టాంపులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అదేవిధంగా ఆమె ఇందుకూరుపేట మండలం నివాసి కాదనే విషయం బయటకు రావడంతో మమత స్టాంప్స్ వెండర్ కు అర్హురాలు కాదని, వెంటనే మమత లైసెన్స్ రద్దు చేసి, ఇందుకూరుపేట మండలంలోని స్థానికులకు వెండర్ లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ నందు జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో వెండర్ మమతపై ఇందుకూరుపేట గ్రామస్తులు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్టాంప్స్ వెండర్ మమత వివరణ:
భీమ్ న్యూస్ ప్రతినిధి స్టాంప్స్ వెండర్ మమతను తన కార్యాలయంలో కలిసి వివరణ కోరగా నేను అమ్మిన ఒక డాక్యుమెంట్ లో 2024 సంవత్సరం అని కాకుండా 2023 అని తప్పుగా ఎంట్రీ అయ్యింది. ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడు జరిగిన తప్పు తెలుసుకుని సరి చేశాను. అలాగే నేను నివాసమున్న కోడూరుపాడు గ్రామం ఇందుకూరుపేట మండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను ఇందుకూరుపేట మండలం నివాసినే అవుతానని తెలిపారు. ఇందుకూరుపేటలో కొందరు వ్యక్తులు తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
Leave a Reply