భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 16) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామంలో కూరగాయల సాగు చేస్తున్న పొలాలను నెల్లూరు ఆత్మ పిడి శివ నారాయణ, ఇందుకూరుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ. రాజ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి డి. రఘునాథరెడ్డి, ఇఫ్కో జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, వెంకటరమణ అనే రైతు పొలాన్ని సందర్శించి, అక్కడ రైతు పొలంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్యం సంస్థ ద్వారా సోలార్ లైట్ ట్రాప్, ఫిరమోన్ డ్రాప్స్, స్టిక్ ట్రాప్స్, పీడీ ఆత్మ శివ నారాయణ చేత పెట్టించారు. ఇంటిగ్రేటెడ్ నూట్రియన్స్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ద్వారా అత్యధిక ఎరువుల వినియోగాన్ని మరియు పురుగుల మందులు వినియోగాన్ని తగ్గించాలని ఉద్దేశంతో పెట్టారని చెప్పారు. ఈ సందర్భంగా ఆత్మ పీ.డి. శివ నారాయణ మాట్లాడుతూ, ఈ ట్రాప్ లో పడిన పురుగులకు సరియైన పురుగుల మందులు వాడి నివారించుకోవచ్చు. పురుగులు ట్రాప్ బుట్టలో పడి చనిపోయి నశిస్తాయి. లింగాకర్షగా బుట్టలు పెట్టటం వలన, మగ పురుగులు పడి నశిస్తాయి. దీని ద్వారా పురుగుల ఉధృతి తగ్గించవచ్చు అని, ఈ లింగాకర్షణ బుట్టలు, సోలార్ లైట్ ట్రాప్, అన్ని రకాల ట్రొప్స్ ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు తక్కువ ధరకే అందించబడుతుందని తెలిపారు.
సోలార్ లైట్ ట్రాప్ ఒకటి 1500 రూపాయలు ఎకరాకి రెండు సరిపోతాయి. లింగాకర్షణ బుట్టలు ఒకటి 40 రూపాయలు ఎకరానికి 5 సరిపోతాయని తెలియజేశారు. అనంతరం ఏ.డి.ఏ. రాజ్ కుమార్ మాట్లాడుతూ, కూరగాయల రైతులు అధిక మొత్తంలో రసానిక ఎరువులను,రసానిక పురుగు మందులను వాడటం వలన, వాటిని తిన్న ప్రజలు అనేక రోగాలు బారిన పడుతున్నారు. కావున సమతుల్యమైన ఎరువులు, పురుగులు మందుల్ని వాడాలని రైతులకు తెలియజేశారు. ఇఫ్కో జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రసానిక ఎరువులను, పురుగుల మందును ఎక్కువగా ఉపయోగించడం వల్ల అధికంగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. అనేక రకాలైన తెగుళ్లు సోగుతాయి. కావున కూరగాయలు మొక్కలపై ద్రవరూపంలో ఉన్న నానో యురియా, నానో DAP ని పిచికారి చేయటం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. తర్వాత రైతు క్యాబేజీ పంటపై నానో యూరియా, నానో డి.ఏ.పి. వాడి చూపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.
Leave a Reply