భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 16) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీ పెట్రోల్ బంక్ సెంటర్ లో బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని భీం భారత్ సైనిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోలవరపు కార్తికేయ అన్నారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని తహశీల్దార్ కార్యాలయంలో నేడు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రోడ్లు మరియు భవనాలు శాఖ మండల సహాయ ఇంజనీరు నరేష్ కి మరో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ డేవిస్ పేట పంచాయతీ పెట్రోల్ బంక్ సెంటర్ లో ఒక హోటల్ మరియు పెట్రోల్ బంక్ కార్యాలయం ఆర్ అండ్ బి స్థలంలో నిర్మాణం చేసి వున్నారని, వాటికి ఆర్ అండ్ బి శాఖ నుండి ఏ అనుమతులు మంజూరు కాలేదని అన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నవి. అందులో భాగంగా హోటల్ ను, పెట్రోల్ బంక్ కార్యాలయాన్ని తొలగించాలని ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్ హోటల్ మరియు పెట్రోల్ బంక్ యజమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆ స్థలంలో ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో మండలంలోని దళిత సంఘాల ప్రతినిధులు స్పందించి రాజకీయ నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీం భారత్ సైనిక్స్ సభ్యులు సయ్యద్ సిరాజ్, పోలవరపు నిఖిల్, బొచ్చు సాంబశివ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply