భీమ్ న్యూస్ ప్రతినిధి వెంకటాచలం (డిసెంబర్ 16) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామం కుంకుమపూడి ఎస్సీ కాలనీలో గత 6 నెలల నుంచి తాగునీరు సమయానికి రావడం లేదని, కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నామని భారత్ మహాసేన నాయకులకు తెలియజేయడంతో ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సోమవారం వెంకటాచలం మండలం ఎం.పి.డి.వో. కల్పనకి భారత్ మహాసేన సేవాదళ్ నాయకులు జువ్విగుంట బాబు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకే త్రాగునీరు వదిలమని పంచాయతీ సెక్రటరీకి ఎం.పి.డి.వో. ఆదేశించారు.
రాజకీయ నాయకుల మాటలకు తలొగ్గి ఎస్సీ కాలనీ వాసులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, అలాగే అధికారులు రాజకీయాలు చేయడం తగదని, ఒకవేళ అలా చేస్తే రాజ్యాంగంలోని చట్టం ప్రకారం అధికారులు మాత్రమే బలి అవుతారనే విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోవాలని ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీకి భారత్ మహాసేన నాయకులు సూచించారు. అధికారులు సానుకులంగా స్పందించి, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇక మీదట కుంకుమపూడి కాలనీ వాసులకు ప్రతీ రోజు 6 గంటలకు తాగునీరు వదిలి వారికి ఎటువంటి నీటి కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుంకుమపూడి కాలనీవాసులు పాల్గొన్నారు.
Leave a Reply