భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 16) ఏపీలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు, జర్నలిస్టుల రక్షణ కొరకు కఠిన చట్టాలు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది.
ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆదేశాల మేరకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మక్కెన సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కలసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం చేయాలని వినతి పత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని కలసిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) రాష్ట్ర ఉపాధ్యక్షులు మక్కెన సురేంద్ర బాబు, స్టేట్ సెక్రటరీ ఖాదర్ వలి షేక్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. జయప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు పి. కోటిశ్వరరావు, పి. వెంకటేశ్వర్లు, వేణు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply