భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 18) మా సర్కిల్ లో బెల్టు షాపు కావాలంటే పది వేలు కొట్టు షాపు పెట్టు. ఎక్సైజ్ స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఇది. ఒక ప్రక్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెల్టు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా, ఆ ఆదేశాలను బేఖాతరు చేసి బెల్టులకు ప్రోత్సాహం ఇస్తున్న కలెక్షన్ కింగ్ ఈ కంప్యూటర్ ఆపరేటర్. పూర్తి వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలోని ప్రోహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన సర్కిల్ స్టేషన్. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ స్టేషన్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ ఆగడాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయని స్టేషన్లో సిబ్బంది గుస గుసలు. స్టేషన్ కి అధికారి సర్కిల్ ఇనస్పెక్టర్ అయినా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కి నమ్మకమైన కలెక్షన్ ఎజెంట్ గా వుంటూ స్టేషన్లో ఇతర అధికారులపైన అజమాయిషీ చేస్తుండటం గమనార్హం. ఆ స్టేషన్లో పనులన్నీ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పినట్లే జరుగుతాయి.
అధికారులకు మామూళ్లు ఇవ్వాలని సర్కిల్ స్టేషన్ పరిధిలో వున్న 18 మద్యం షాపులకు, అనుమతులు లేని సుమారు 100 బెల్టు షాపులకు హుకుం జారీ చేసి, ఆ షాపుల నుండి మద్యం షాపుకైతే లక్ష, బెల్టు షాపుకైతే పది వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కంప్యూటర్ ఆపరేటర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కాదు, కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగి కాదు. అయినా సరే అతని మాట షాపు యజమాని వినకుంటే పోలీసులు రైడ్, అరెస్టు, కేసు నమోదు, కోర్టులో జరిమానాలు, శిక్షలు అమలవుతాయి. అతను అడిగిన మామూళ్లు ఇస్తే మాత్రం, పోలీసులు రైడ్ కి వచ్చే సమయంలో షాపు యజమానికి రైడింగ్ కి వస్తున్నారు తప్పించుకోమని ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల నుండి తప్పిస్తూ షాడో స్పై లా వ్యవహరించడం విశేషం. జిల్లా ఉన్నతాధికారులు ఈ సర్కిల్ స్టేషన్ పై దృష్టి సారించి, అక్రమాలను అరికట్టాలని బాధితులు మీడియా ముఖంగా కోరుతున్నారు.
Leave a Reply