భీమ్ న్యూస్ ప్రతినిధి గుంటూరు (డిసెంబర్ 19) మనువాద మతోన్మాద కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటం దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్య అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మతోన్మాద చర్యను సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ ఖండిస్తుందన్నారు. ప్రజలు, ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు.
ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు ఏడు జన్మలకు స్వర్గం దక్కుతుంది కదా అనటమే కాకుండా మాటి మాటికీ అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఏగతాళిగా మాట్లాడటం సరికాదన్నారు.
ఎన్పికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారం లోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గు చేటని నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగం పై, ప్రభుత్వరంగ సంస్ధలపై దాడి చేస్తున్నారన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అమీషాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Leave a Reply