భీమ్ న్యూస్ ప్రతినిధి కుప్పం (డిసెంబర్ 20) చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి షాక్ తగిలింది. రేపే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలపై ఆంక్షల విధించారు.
శనివారం కుప్పం నియోజకవర్గంలో సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ తెలిపారట. పుట్టిన రోజు వేడుకలు కార్యాలయంకే పరిమితం కావాలని, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే చట్ట పరంగా చర్యలు అంటూ పోలీసులు అదేశాలు ఇచ్చారట. అయితే ఏపీ పోలీసుల వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు. మండిపడుతున్నారు.
Leave a Reply