భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (డిసెంబర్ 20) ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేటి గురువారం ఉదయం 11 గంటలకు నెల్లూరు వి.ఆర్.సి. సెంటర్లో గల అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్.డి.పి.ఐ. పార్టీ సభ్యులు కూడా భాగస్వామ్యమై నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని అలాగే భారతీయ జనతా పార్టీకి అంబేడ్కర్ పై గౌరవం ఉంటే పార్టీ నుండి బహిష్కరించాలని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు క్రాకుటూరు పుష్పాంజలి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మేము ఒక్కసారి కాదు లక్షల సార్లు, కోట్ల సార్లు అంబెడ్కర్, అంబేద్కర్ అని అంటామని, జీవితాంతం అంటూనే ఉంటామని తెలియజేస్తూ అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎస్డిపిఐ నాయకుడు రఫీ మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకాలు ఎంతో కాలం సాగవని, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై మతతత్వ బిజెపి పార్టీని ఓడిస్తామని అన్నారు. తక్షణం కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను తొలగించాలని అలాగే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ బి. శ్రీరామ్, జిల్లా ఉపాధ్యక్షులు జికే అబ్దుల్ ఘని, జిల్లా కార్యదర్శి కడింపాటి అశోక్, కోశాధికారి మర్రి రామచంద్రయ్య, కోవూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కడింపాటి అనిల్, చాట్ల వేణు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి కరుణ కట్టమంచి, సీనియర్ నాయకులు నగేష్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎంబేటి వినయ్, ఉదయగిరి నియోజకవర్గం నుండి క్రాకుటూరు వసంత్, మైనారిటీ నాయకులు సర్దార్ లతో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply