భీమ్ న్యూస్ ప్రతినిధి వజ్రపు కొత్తూరు (డిసెంబర్ 20) అర్హులైన నిరుపేదలకు పార్టీలకు అతీతంగా పారదర్శంగా ఇళ్ల మంజూరు చేయాలని ఎంఎల్ఏ గౌతు శిరీష ఆదేశాలతో గోవిందపురం పంచాయితీలో లబ్ధిదారులు ఎంపిక, అర్హులైన నిరుపేదలకు పార్టీలకు అతీతంగా పారదర్శంగా ఇళ్ల మంజూరు చెయ్యడం జరుగుతుంది అని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ అన్నారు. ఎంఎల్ఏ గౌతు శిరీషమ్మ ఆదేశారం పూండి గోవిందపురం పంచాయతీలో బుధవారం ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఇళ్ల స్థలాలను సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు.
పేద ప్రజలకు గూడు కల్పించాలన్న ఆలోచనలతో కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటోంది అని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇల్లు లేని వారికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద గ్రామాల్లో కొత్త ఇండ్లు మంజూరు దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ గొర్లె గణేష్, టీడీపీ సీనియర్ నాయకులు లావేటి శంకరరావు, పాలిన చంద్రయ్య, పుచ్చ అప్పలస్వామి, సర్వే అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Leave a Reply