భీమ్ న్యూస్ ప్రతినిధి టెక్కలి (డిసెంబర్ 21) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి ఇంచార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కోలాహాలంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు, మహిళలతో కలిసి టెక్కలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెక్కలి బీసీ సంక్షేమ హాస్టల్ లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమంలో భాగంగా అక్కడున్న విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా అందరి సమక్షంలో టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరడ తిలక్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో భారీ రక్తదాన శిబిరం టెక్కలి ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగింది. జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతలు నినాదాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో టెక్కలి నందిగాం, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Leave a Reply