భీమ్ న్యూస్ ప్రతినిధి మెలియాపుట్టి (డిసెంబర్ 23) ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలోని గిరిజన ప్రాంతాలను పర్యటించి గిరిజనుల యొక్క సాధక, బాధలు, జీవన విధానం, సంస్కృతులు, కష్టాలు తెలుసుకుని గిరిజన అభివృద్ధికి అండగా నిలబడిన వ్యక్తి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అని, ఏజెన్సీ ప్రాంతంలో 105.33 కోట్ల మేర ఖర్చు చేసి ఎన్డీఏ ప్రభుత్వం రహదారులు నిర్మిస్తుందని పలు గిరిజన గ్రామాలకు రోడ్లు శంకుస్థాపన చేశారని, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ కి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని. చంద్రమోహన్ తెలిపారు.
పాతపట్నం నియోజకవర్గ జనసేన నాయకురాలు కోరికానా భవాని సూచనలు మేరకు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ గిరిజన నాయకులు, జిల్లా కార్యదర్శి సాలాసన షణ్ముఖరావు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాలాసన షణ్ముఖరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో గిరిజనుల మారుమూల ప్రాంతానికి వెళ్లిన ఏకైక వ్యక్తి, మంత్రి పవన్ కళ్యాణ్, గత వైసిపి ప్రభుత్వం గిరిజనులను మోసం చేసింది. 100% గిరిజన ఎమ్మెల్యేలను, ఎంపీ సీట్లు గెలిపించినప్పటికీ గిరిజన అభివృద్ధికి ఏమాత్రం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు గిరిజనుల యొక్క నిధులని పక్కదారి మళ్లించి గిరిజనులకు తీవ్రమైన అన్యాయం, మోసం చేశారని చెప్పారు.
గిరిజనులకు అండగా నిలబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిజనులందరూ మేల్కొని మనకి న్యాయం చేస్తున్న వ్యక్తులు ఎవరు అన్నది గిరిజన ప్రజానీకం, గిరిజన పెద్దలు, విద్యార్థులు, మేల్కొని మన అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తులతో మనం నడవవలసిన అవసరం ఉంది గిరిజన సమాజానికీ తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సవర రమూర్తి, జనసేన పార్టీ మెలియాపుట్టి మండల జనసేన నాయకులు లక్ష్మిపురం కిరణ్ మాట్లాడుతూ గిరిజనులకు అండగా ఉన్న ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పారు. అలాగే మాలాంటి గిరిజన యువతకి దేవుని గా మేము భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల జనసేన నాయకులు దుక్క బాలరాజు, చంటి, ప్రశాంత్, పిట్టా హరి, నారాయణ, జన్ని కాంతారావు, రవి, జన సైనికులు పాల్గొన్నారు.
Leave a Reply