భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబరు 24) బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి ఆదేశానుసారం పార్లమెంటులో బిజెపి ప్రభుత్వ మంత్రి అమిత్ షా ప్రపంచ మేధావి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సర్కిల్ వద్ద వందలాదిగా కార్యకర్తలు విచ్చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేస్తూ కలెక్టర్ వారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదేశించి మాట్లాడిన ప్రతి ఒక్క నాయకులు కేంద్రమంత్రి అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, షా ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు క్రాకుటూరు పుష్పాంజలి, జిల్లా ఉపాధ్యక్షులు జి.కే. అబ్దుల్ ఘని, జిల్లా ఇన్చార్జ్ బి. శ్రీరామ్, జిల్లా కార్యదర్శి కడింపాటి అశోక్, జిల్లా కోశాధికారి మర్రి రామచంద్రయ్య, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులు నగేష్, కట్టమంచి అరుణ, అర్జున్ బాలకృష్ణ, సీనియర్ న్యాయవాది కాకి శాంతి కుమార్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఇండ్ల శివయ్య, ఎంబేటి నారాయణస్వామి, ఎంబేటి వినయ్, మర్లపాటి మురళి, సర్వేపల్లి నియోజకవర్గం నుండి పున్నూరు ఏడుకొండలు, బిరుదోలు మస్తానయ్య, కరేటి రవీంద్ర, పాలెపు రమేష్, గెరి సురేంద్ర, కోవూరు నియోజకవర్గం నుండి కడింపాటి అనిల్, కడింపాటి వెంకన్న, ముదివర్తి కృష్ణమూర్తి, ఎల్లు శ్రీనివాసులు, గాలి రాజా, ఆత్మకూరు నియోజకవర్గం నుండి టి. కృష్ణ, కార్యకర్తలు, ఉదయగిరి నియోజకవర్గం నుండి కర్ర గోపాల్, క్రాకటూరు వసంత్, మాజీ జిల్లా అధ్యక్షులు చిరమణ సుధాకర్, మరో మాజీ అధ్యక్షులు వాకాటి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా ఇంచార్జ్ షోడవరం సుధాకర్, మాజీ జిల్లా కన్వీనర్ మీజూరు మాధవ్, మాజీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు దాసరి అశోక్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నుండి సీనియర్ న్యాయవాది ఎం. బ్రహ్మం, ఎల్లంకి వెంకటేశ్వర్లు, వి.సి.కె. నుండి ఇంగిలాల మదన్ మిశ్రా సీనియర్ దళిత నాయకులు దళిత బాబు, బహుజన లాయర్స్ ఫోరం నుండి కడింపాటి అనురాధ, ఎస్.కె. బాబా, కే.ఎన్.పి.ఎస్. నుండి ఏరూరు బాలయ్య, ఎస్.డి.పి.ఐ. నుండి కూడా నాయకులు, కార్యకర్తలు, కావలి, కందుకూరు నియోజకవర్గం నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply