భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (డిసెంబర్ 24) తిరుపతి జిల్లా నాగలాపురం మండలం రేప్పాలతిప్ప పరిధిలోని అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ బలగాల దాడుల్లో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టాస్క్‌ఫోర్స్ ఇంఛార్జ్ ఎస్పీ శ్రీనివాస్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
రేప్పాలతిప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు ఆకస్మిక దాడులు జరిపాయి. ఆ సమయంలో అక్రమ రవాణా చేసేందుకు ఎర్రచందనం దుంగలు సిద్ధం చేస్తున్న కేవీబిపురానికి చెందిన సురేంద్ర, నాగలాపురానికి చెందిన మునివేలు, తమిళనాడు సేలం జిల్లాకు చెందిన సెల్వరాజి దొరైస్వామితో పాటు మరో ఐదుగురు తమిళ కూలీలను అరెస్టు చేశారని, వీరి నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 479 కేజీల 69 ఎర్రచందనం దుంగలు, ఒక మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ చిరంజీవి, ఇన్‌స్పెక్టర్ ఎం.సురేష్ కుమార్, నరేష్, సిబ్బందిని అభినందించారు.
Leave a Reply