భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (డిసెంబర్ 25) తిరుపతి జిల్లా నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ కేంద్రంను డిఎస్పీ చెంచు బాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీ శంకర్, సీఈఓ సీతారామ నాయుడు తదితరులు బుధవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంను నాయుడుపేటతో పాటు పరిసర మండలాల ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందని ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేకుండానే ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.
ట్రస్ట్ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం ఖర్చు తమ సొంత నిధుల ద్వారానే ఏర్పాటు చేస్తున్నట్లు, ఇప్పటివరకు 50 మంది శిక్షణ కోసం నాయుడుపేట లో నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఉచిత శిక్షణ కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుందని నాయుడుపేటతో పాటు, పరిసర మండలాల ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణ , లబ్ధిదారులు, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply