భీమ్ న్యూస్ ప్రతినిధి ఆసిఫాబాద్- తెలంగాణ (డిసెంబరు 26) తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు తెలంగాణలో చేపడుతున్న దీక్షలు గురువారం నాటికి 17వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చీపుర్లతో ఉడుస్తూ వినూత్నరీతిలో నిరసనవ్యక్తం చేశారు. దీక్షశిబిరాన్ని టీయూటీఎఫ్ నాయకులు సదాశివ్, వెంకట్ రావు, ధన్రాజ్, జలపతి తదితరులు పాల్గొని సంఘీ భావం తెలిపి రూ.10వేల ఆర్థికసాయం చేశారు. అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఅభ్యర్థి డాక్టర్ ప్రసన్నహరి కృష్ణ దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యూలర్ చేసి పేస్కేల్ అమలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు శృతిక, సంతోష్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్:
తెలంగాణ రాష్ట్రంలోని సమగ్రశిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటంపై సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంతన్యూస్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమగ్రశిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్న ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Leave a Reply