భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 27) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూ ఇంటర్షిప్ కొరకు వచ్చిన్న RAWEP స్టూడెంట్స్, గురువారం జాతీయ సేవా పథక కార్యక్రమాన్ని జగదేవిపేట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏడు రోజులు 2024.12.26 నుంచి 2025.01.01 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి డి. రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ఇందుకూరుపేట మండలంలో రైతులు అన్ని రకాల వ్యవసాయ పంటలు సాగు చేయటం వలన విద్యార్థులకు ఇంటర్శిప్ కు అనుకూలమని తెలిపారు.
జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. కే. కిషోర్ కుమార్ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన అందుబాటులో ఉంటామని తెలిపారు. అనంతరం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డా. లోకేష్ బాబు జాతీయ సేవా పథక రోజు వారీ కార్యక్రమాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. హెడ్ శైలజ, జగదేవిపేట గ్రామ సర్పంచ్ రాధయ్య, ఉప సర్పంచ్ రాధా కృష్ణారెడ్డి, కూకటి వెంకటేశ్వర రెడ్డి, డేగపూడి శ్రీనివాసరెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, గ్రామ రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Leave a Reply