భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 27) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు జాతీయ సేవా పథకం 2వ రోజు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా “Save no to plastic” అనే ర్యాలీని చేశారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర కళాశాల ఉపాధ్యాయురాలు డా. వి. శైలజ మాట్లాడుతూ, అరటి పంట వేసుకునే రైతులు వైరస్ తెగులు సోకని ఆరోగ్యమైన తోటల నుండి మూడు మసాలా వయస్సు కలిగి, రెండు లేదా మూడు కోతలు పడిన సూది పిలకలు మాత్రమే ఎన్నుకోవాలని, పిలకలను నాటే ముందు 1% కార్బెండజిమ్ 50% ద్రావణంతో 5 నిమిషాలు శుద్ధి చేసిన తరువాతనే వాటిని నాటుకోవాలని వివరించారు.
విద్యార్థినిలు రైతులకు అరటి పిలకలు ఎలా శుద్ధి చేసుకోవాలో చేసి చూపించారు. కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు శాస్త్రవేత్త డా. కె. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరి పంట రైతులు జీవన ఎరువులు వాడుకొని రసాయన ఎరువుల మోతాదు 25% శాతం తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినిలు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ, కొనుగోళ్లకు వెళ్ళేటప్పుడు గుడ్డ లేదా జ్యూట్ బ్యాగులు తీసుకెళ్లటం మర్చిపోవద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మనుషులకే కాకుండా జంతువులకు, పర్యావరణానికి కూడా హనికరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శైలజ, యూనివర్సిటీ విద్యార్థినిలు పాల్గొన్నారు.
Leave a Reply