భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 28) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, పల్లిపాడు గ్రామంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో 2022-24 విద్యా సంవత్సరంలో డి.యల్.ఇ.డి. చదివిన ఛాత్రోపాధ్యాయులకు శుక్రవారం సర్టిఫికెట్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రమేష్ హాజరై సర్టిఫికెట్ లు అందజేసినట్లు తెలిపారు. సంస్థ నందు రెండు సంవత్సరాల కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని, ఉత్తీర్ణులైన పూర్వపు ఛాత్రోపాధ్యాయులకు ఇవ్వవలసిన అన్ని రకాల సర్టిఫికేట్ లతో పాటు మెడల్స్ కూడా ప్రధానం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
2022-24 బ్యాచ్ లో ప్రథమ స్థానంలో కె. లోకేశ్వరి, ద్వితీయ స్థానంలో యస్.కె. రిజ్వానా, తృతీయ స్థానంలో యస్.కె. ఫుమియా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఛాత్రోపాధ్యాయులందరూ భవిష్యత్తులో జరగబోయే టెట్ మరియు డి.యస్.సి. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, టీచర్ పోస్టులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఛాత్రోపాధ్యాయులు సంస్థలో వారు చదివినప్పటి అనుభవాలను అధ్యాపకులతో, ప్రస్తుత జూనియర్ శిక్షణార్థులతో పంచుకొన్నారు. అనంతరం ప్రధానాచార్యులకు, ఉపన్యాసకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రిన్సిపాల్ ఛైర్ ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి. నరసింగరావు, కె. షఫీ అహ్మద్, యస్.బి. దాస్, కె. విజయచంద్ర, యన్. శివ, కార్యాలయ సూపర్నెంట్ యమ్. మేరీ ప్రసూన, కార్యాలయ సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave a Reply