భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 29) ఏపీ సర్కారు మాత్రం జనవరి 1ని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలి డే గా ప్రకటించినట్లు తెలుస్తొంది. దీంతో ప్రభుత్వ సెలవు లేదని కేవలం ఆరోజు ఆప్షన్ హాలి డే ఉందని తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నట్లు తెలుస్తొంది. అయితే డిసెంబరు 31న చాలా మంది నైట్ అవుట్ లు చేసి పార్టీలు చేసుకుంటారు. ఈ క్రమంలో మరుసటి రోజు మాత్రం ఏపీసర్కారు ఈ విధంగా ట్విస్ట్ ఇవ్వడంతో మాత్రం కొంత మంది తెగ బాధపడిపోతున్నారంట.
చాలా మంది కొత్త ఏడాది వచ్చిందంటే వరుసగా సెలవులు పెట్టి ఎక్కడికైన టెంపుల్స్ లేదా సరదాగా గడిపే విధంగా ప్లాన్ లు చేసుకుంటారు. అయితే ఈసారి మాత్రం కూటమి సర్కారు ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని కొంతమంది తలలు పట్టుకుంటున్నారని, మొత్తానికి ఏపీ సర్కారు నిర్ణయం పట్ల కొందరు మనస్తాపానికి గురౌతున్నట్టుగా సమాచారం.
Leave a Reply