భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు రూరల్ (డిసెంబర్ 29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ ఆదేశాలతో నెల్లూరు పురపాలక శాఖ అధికారులు అనుమతులు లేని అక్రమ లే అవుట్ లలో అమ్మకాలు కొనుగోళ్లు నిషిద్ధం అని కొన్ని లే అవుట్ లను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం గ్రామం 2/1 సచివాలయం పరిధిలోని బృందావనం లే అవుట్ బ్లాక్ లిస్ట్ లో వుందని 2/1 సచివాలయం అడ్మిన్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. సదరు లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్లాటు యజమానులు భవనాలు నిర్మాణం చేయరాదని ఆదేశిస్తూ భవన నిర్మాణశాఖ నుండి నోటీసులు జారీ చేశామని 2/1 సచివాలయం టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ స్పష్టం చేశారు.
ఆ లే అవుట్ కు నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు లేకున్నా గానీ, ఆ లే అవుట్ లో భవన నిర్మాణాలు శర వేగంగా జరుగుతుండటం, పవర్ కోసం విద్యుత్తు స్థంబాలు, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్తు శాఖా అధికారులు ఏర్పాటు చేయడం విశేషం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశాలు తుంగలో తొక్కి, నెల్లూరు పురపాలక శాఖ, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ, నెల్లూరు భవన నిర్మాణ శాఖా అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేసిన వైనం. అదీను కాక 1.54 సెంట్లు ప్రభుత్వ భూమిని (కాలువ పోరంబోకు) దర్జాగా కబ్జా చేసి జోరుగా అమ్మకాలు చేయడం గమనార్హం.
Leave a Reply