భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 30) జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఐదవ రోజు రైతు సదస్సు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లలితా శివజ్యోతి, మండల వ్యవసాయాధికారి డి. రఘునాథ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ వి. శైలజ, డాక్టర్ ఎస్. లోకేష్ బాబు, డాక్టర్ కిరణ్ కుమార్ లు విచ్చేశారు. రైతు సదస్సులో రైతుల సమస్యలపై చర్చించి, ఆవశ్యకమైన పరిష్కారాలను కనుగొన్నారు. రైతులు తమ యొక్క సమస్యలను శాస్త్రవేత్తలకు తెలియజేశారు. శాస్త్రవేత్తలు వాటికి చక్కటి పరిష్కారాలను తెలిపారు.
రైతు సదస్సులో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రైతులకు ఉపయోగపడే అనేక అంశాలపై నమూనాలు తయారు చేశారు. పుట్టగొడుగుల పెంపకం, పాలీహౌస్, డ్రం సీడర్, వర్మీ కంపోస్ట్, హైడ్రోపోనిక్స్ మరియు డ్రోను లాభాలు మరియు ఇటువంటి ఎన్నో అంశాలపై నమూనాల రూపంలో రైతులకు వివరించారు. నమూనాలని పరిశీలించిన రైతులు తమ యొక్క సందేహాలను విద్యార్థినులతో పంచుకున్నారు. విద్యార్థినులు వారికి తెలిసిన సమాచారాన్ని రైతులకు వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తల సహాయం కూడా అందించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ విలువైన సలహాలను ఇచ్చినవారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి రైతుకు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తమ అభిప్రాయాలను పంచుకున్నందుకు వారికి విద్యార్థినిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు మన రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచాలని ఆశిస్తున్నట్టుగా విద్యార్థినిలు, శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Leave a Reply