భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 31) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఫించన్లు పంపిణీ కార్యక్రమానికి కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీకృష్ణ మందిరంలో కృష్ణ భగవాన్ ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వృద్ధులకు, మహిళలకు ఫించన్లు పంపిణీ చేశారు. తదనంతరం నియోజకవర్గం ప్రజలకు 2025 ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో వుండాలని ఆకాంక్షించారు. అనంతరం కొత్తూరు పంచాయతీ పాములవారిపాలెం గ్రామంలోని లబ్దిదారుడు నరసయ్య గోకులం షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోకులం షెడ్డు గురించి తనకు పూర్తిగా అవగాహన లేదని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు ప్రోత్సాహంగా 90% సబ్సిడీని ఇస్తున్నారని, అందుకు వారిరువురికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. పాడి రైతు నరసయ్యకు గోకులంలోని పశువులను శ్రద్ధగా చూసుకోవాలని సూచించారు.
చివరిగా కొత్తూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వ సభ్య సమావేశానికి హాజరయ్యారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతూ మండలంలో లోతట్టు ప్రాంతాల్లో కట్టిన జగనన్న ఇళ్లకు తాము వెళ్ళలేమని కొందరు లబ్ధిదారులు చెప్పిన మాటలు తన దృష్టికి వచ్చాయని, జగనన్న గృహాలు జారీ చేసిన జాబితాలో చాలా మందికి మంచి ఇల్లు ఉన్నాయని తెలుస్తోందని అన్నారు. తొలి విడత గృహాలు వచ్చిన జాబితాలో అందరూ ఇల్లు కట్టుకోవాలని, ఆ విధంగా లబ్ధిదారులతో అధికారులు మాట్లాడి, వచ్చిన ఇళ్లను పూర్తి చేయాలని, వెనక్కి తిప్పి పంపే ఆలోచన చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావెళ్ళ వీరేంద్ర నాయుడు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, పొన్నెబోయిన చెంచు కిషోర్ యాదవ్, వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది, స్థానిక మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply