భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (డిసెంబర్ 31) తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణ విడుదల చేయాలని కోరారు. నాన్ ఆప్కాస్ మరియు ఆప్కాస్. కార్మికులు గా ఏర్పడే సందర్భంలో ఒక్కో కార్మికుడికి 12 వేల రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు ఎవరు తిన్నారో నిగ్గు తేల్చాలని ఆయన తెలిపారు. అదే విధంగా మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు 3000 రూపాయలు, సహజ మరణం కింద మరణించిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చెల్లించడంలో మున్సిపాలిటీ పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు.
మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్ లు నివేశ స్థలాలు గట్టి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్లు రిపేర్లు అయితే డ్రైవర్లే మరమ్మత్తుల ఖర్చులు భరించుకోవాలని కమిషనర్ హుకుం జారీ చేయడం మంచి పద్ధతి కాదని, నియంతలాగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు నూనె, పాదరక్షలు, నాణ్యమైన సబ్బులు, ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కానీయెడల , పోరాటాలను దశలవారీగా తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నెలవల హరికృష్ణ , మధు మహలక్ష్మమ్మ, రమణమ్మ, మణి, తేజ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply